Sunday, March 28, 2021

 నాటి బతుకు నేడు ఉన్నదా....!

నేటి బతుకు రేపు ఉండునా...?


అర్ధం కానీ జీవిత ప్రయణం లో....!

అందని కలలేన్నో... సమాధానం లేని ప్రశ్నలేన్నో...!


దేనికి జననం, ఎందుకు మరణమో..!

తెలియని జీవయాత్రలో...!

గమ్యం ఏ వైపో తేలియని నావలో పయణం....,!


గడిచే కాలం, ముగిసే సమయం...,

ఉన్న కొద్దిపాటి జీవితం....!


మళ్ళి జన్మంటూ ఉంటుందో లేదో...!

అసలు రేపంటు చూస్తామో, లేదో...!

ఏ క్షణాన ఏం జరుగునో.....?


నవ్వైన, బాదైన ఇందులొనే...!

ఆశలైన, ఆతృతలైన ఇప్పుడే...!


ఎవరికీ తెలుసు....??

ఎవరికేప్పుడు కాలం చేల్లునో....?

ఎవరు చూస్తారో రేపటి ఉదయం..!


ఇప్పటి జీవితం నీది..., ఒక్కటే ఇది..!

పోతే రాదు మళ్ళి....!



Written by     _mounu goud




Wednesday, March 24, 2021

Poem5


మాయ ప్రపంచం లో 

 స్వప్నం లాంటి జీవితం..

క్షణం లొ ముగిసే సమయం,

అశాస్వత జీవిత గమనం.

రోజుకొక కొత్త ఆట,

కొత్త వేట,

కన్నిల్ల తుంపర,

సుఖ సంతోషలా పరంపర..


ఏమిటో ఈ ప్రాణపు బొమ్మల కథ..

పరమేశ్వరుడే ఏరుగుదు అందరి కథ..


_mounu goud

Poem4

       కవిత్వం

కవిత్వం అంటే ఊహలకి రూపం

 భావోద్వేగాలకి ప్రతిరూపం..

 భావాలకి చిరునామా.. 

తీయని పదాల కలయిక..

 అనుభూతి చెందే ఆత్మీయత ..

మనసును తాకే మధురం.. 

ఏది మాటలకి అందదో..

 ఏది వర్ణించ వీలుకాదో..

 ఏది మనసుని గెలవగలదో..

ఏది మనసుతో చూడగలమో..


 అదే కవిత్వం


               _mounu goud


Dedicated for onesidelove

 బావుక బీజాలతో 

        మనసు పూదోట నాటి.. 

 ఆశల వనం లో

        ప్రేమ పూవ్వు గా వికసించి...

అంతులేని ఎదురు చూపులతో 

        కాలం గడిచి...

 మోడుబోయిన బోయిన జన్మకి ..

రాటుతేలిన గుండె కి..

 ఈ కవిత అంకితం....


               _mounu goud

To my love


               ప్రేమ


వసంతమనుకొనా నీతొ ఈ పరిచయం

వలపనుకొనా నీతొ ఈ పరవశం

వరమనుకొనా నీతొ ఈ పరిణయం..


  ఏనాటి బందమో తేలియదు.., కాని,

 అన్ని బందాలు నీలో చూస్తూన్నా..,

  నా ఆశలకి ప్రాణం పొసి...,

       నా ఊహలకి ఊపీరి నిలిపి..,

నన్ను నాలా మలిచిన నీకు..

 ఏమి యిచ్చి, 

 రూణం తీర్చుకొను...

    నా ప్రాణం తప్ప...


                      Written by _mounu