Sunday, November 6, 2022

ఆమె


             ఆమె...

ఎవరు ఆమె...?
దేనికై ఆమె..?
 అమ్మనా ఆమె..? 
బిడ్డనా ఆమె...?
 భార్యనా ఆమె..?
 సోదరీనా ఆమె..?
 ఆమె అస్తిత్వం ఏది..?
 ఆమె స్థిరత్వం ఏది...?

 అగ్ని పరీక్ష సీతకే గాని రాముడికి లేదా..!
 ఏ సీతలేనన్ని రోజులు రాముడు కూడా ఒంటరిగానే ఉన్నాడుగా...!
 మరి ఆయన్ని నిందించేదా ఈ లోకం...?

 ఉపవాసాలు వ్రతాలు భార్యలకేనా...!
 ఏ భర్తకి భార్య అవసరం లేదా..?
 ఆమె క్షేమం అవసరం లేదా..??

 శ్రీ రుతు చక్రంలో ఉంటే ముట్టు (అంటూ) అంటారా..!
 ఆ సమయంలో ఆమె దేవుడిని ముట్టకూడద..??
అసలు ఆమెని సృష్టించిందే ఆయనగా...!

 ఏ ధర్మం చెప్పింది..??
 ఏ శాస్త్రం నేర్పింది..??

ఎందుకు ఈ వివక్ష...??. దేనికి ఈ పక్షపాతం..?

ఆమె లేనిది ఈ లోకం నిలబడగలదా...!
 మనిషి మనుగడ సాగగలదా....!!

 ఇక మార్పు రాదా..!. దీన్ని మార్చలేరా...!!



Written_by_mounika