Saturday, April 29, 2023

మరో ప్రపంచం చేరాలని...

 వెతుకుతున్నా నన్నే నేనిలా... ఈ క్షణం..

అన్వేషిస్తున్నా నాకై నన్నే..  అనుక్షణం..

మనసు వేదన, హృదయ రోధన..,

ఆగని ఈ శోధన.. అర్ధం కానీ ఆవేదన..,

ఎందుకోసమో వెతుకులాట.. దేనికోసమో పరుగులాట..,

 గమ్యం లేని గమనం.. , గమనం ఎరుగని పయనం..,

 ఏవేవో ఆలోచనలు, ఎన్నెన్నో ఆత్రుతలు,

 తెలియని పిచ్చి కోరికలు, అంతులేని అత్యాశలు..,

 బరువెక్కిన ఈ హృదయాన, అలుపెక్కిన ఈ మనసున..,

 అంతుచిక్కని ఆలోచనల నడుమ, జనించినది ఓ ఉదయ కిరణం,

 లోకమంతా భ్రమయేనని, శాశ్వతం ఏది కాదని, తెలిసి

 జ్ఞాపకమెరుగని గురుతుల...,   నేనంటూ లేని లోకంల...,

 మిగిలిపోవాలని......,

ఈ చీకటిలో చీకటినై, ఎడారిలో ఎండమావినై....,

ఈ మట్టిలో మట్టినై.. అనంతంలో సమస్తమై...,

 కలిసి పోవాలని.....,,,

 ఈ తనువు, దేహం, కనుమరుగవాలని...,

 కానరాణి మరో ప్రపంచం చేరాలని...,


                           ఓ చిన్ని మనసు ఎదురు చూపులు..


                             మీ మౌన