ఓ శివయ్యా..
పాపం పుణ్యం అంటావు కదయ్యా..
మా భావోద్వేగాలతో ఆడుకోవడం నీకు పుణ్యమంటావా స్వామి..?
నీతి న్యాయం అంటావు కదయ్యా..
మరి మమ్మల్ని బతుకు అనే ఈ నరకంలోకి తోసి జీవితం అనే మాయలో నడిపించడం నీకు న్యాయమంటావా స్వామి..?
ఎందుకు ప్రాణమిస్తున్నావు..?
ఇచ్చిన ప్రాణాన్ని ఎందుకు తిరిగి తీసుకుంటున్నావు..??
ఆశ ఎందుకు పుట్టిస్తున్నావు..?
అవి అడియాశలు ఎందుకు చేస్తున్నావు..??
సంతోషం ఎందుకు ఇస్తున్నావు..?
దాన్ని వెనకే దుఃఖం ఉందని ఎందుకు గుర్తు చేస్తున్నావు..??
అడిగారా నిన్ను ఎవరైనా నాకు ప్రాణం ఇమ్మని...!
అడిగార నిన్ను ఎవరైనా నాకు కోరికలు ఇమ్మని..!
అడగనివి అన్నీ ఇచ్చి అడిగినవి అన్ని ఎందుకు ఇవ్వవయ్యా..??
ప్రశ్నలు ఎన్ని ఉన్నా దానికి సమాధానం మాత్రం శూన్యం..!!
Written by_mounika
No comments:
Post a Comment