స్త్రీ నుదుట కుంకుమ వలె,
ఆకాశంలో ఓ ఎర్రని తిలకం..
ఆమె విరబోసిన కురుల వలె,
భూమిని తాకిన ఓ నల్లని చీకటి..
మిలమిల మెరిసే ఆ తారలు,
ఆమె ముసి ముసి నవ్వులకి తార్కాణం..
విరజిమ్మే ఆ వెన్నెల సొగసులు,
ఆమె స్వచ్ఛని మనసుకి సాక్షాత్కారం..
ఆమె లేనిది ఏడ..?
ప్రకృతియే ఆమె ఒడిలో ఒదిగి పోయాక...!
Written by _mounu
No comments:
Post a Comment