మన మధ్య మాటలు లేవు మంత్రాలు లేవు
చూపులతో గడిచిన క్షణాలు తప్ప..
పరిచయాలు లేవు ప్రణయ లేఖలు లేవు
కాలంతో ఎదురుచూపులు తప్ప..
నీ ఊహల నీడలో గడుపుతున్న ప్రతిక్షణం
నువ్వు నాదానివి అనే భావన..
నీ ఊపిరి జాడలు వెతుకుతున్న ప్రతి నిమిషం
నీవు లేవని చింతన..
మాట చెప్పకుండా మాయమై పోయావు..
మనసు విప్పకుండా మరచి పోయావు..
కన్నుల ఊసులతో
నీ రాక కోసం ఎదురు చూస్తున్న... ప్రియా..
ఏదో ఒకరోజు నా కళ్ళెదుట ప్రసన్నం అవుతావని..
Written by_mounu
No comments:
Post a Comment